Telangana: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ..?

అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  8 July 2024 7:15 AM GMT
brs, mlc challa venkatram reddy, congress, Telangana,

Telangana: కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ..?

అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోగా.. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. కొద్దికాలంగా ఆ పార్టీ నుంచి ముఖ్యనాయకులంతా వలస పక్షుల్లా ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా మరో ఎమ్మెల్సీ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్‌ బీఆర్ఎస్‌ వర్గాల్లో ఆందోళనను పెంచుతుంది.

నియోజకవర్గ అభివృద్ధి కోసమే అంటూ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ను వీడి అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో.. మరో నాయకుడిని బీఆర్ఎస్ కోల్పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పార్టీ అదినేత కేసీఆర్ ఎన్ని రకాలుగా నచ్చజెబుతున్నా.. నాయకులు మాత్రం వరుసగా పార్టీని వీడాలని నిశ్చయించుకున్నట్లు అర్థం అవుతోంది.

రెండు రోజుల క్రితం గ్రేటర్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబును కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది. శ్రీధర్ బాబును కలిసిన వారిలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మా రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఉన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనుల కోసం కలిసినా కూడా ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం కొనసాగుతోంది.

Next Story