కరోనా లక్షణాలు దాస్తున్నారా..? అయితే మీ పని అంతే
By సుభాష్ Published on 10 April 2020 7:44 AM GMTకరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా బుసలుకొడుతోంది. మృత్యువును వెంటాడుతోంది. తాజాగా ఏపీలో ముగ్గురినిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కరోనా లక్షణాలున్నాయని బయటకు చెప్పనందున తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ తెలిపిన వివరాల ప్రకారం..విశాఖ జిల్లా నుంచి శంఖవరం మండలం కత్తిపూడికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి ఆర్ ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. తర్వాత కరోనా లక్షణాలున్నాయన్న విషయం గోప్యంగా ఉంచారు. దీంతో బాధితుడి మామ, వైద్యం చేసిన ఆర్ ఎంపీ డాక్టర్, అతడికి రక్షపరీక్షలు చేసిన ల్యాబ్ టెక్నీషియన్ లపై కేసులు నమోదు అయ్యాయి. ఇక బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స నిమిత్తం విశాఖకు తరలించారు.
ఎవరైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం అందించకపోతే ఆ కుటుంబ సభ్యులతో పాటు వైద్య చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. కాగా, ఏపీలో ఇప్పటి వరకూ ఏపీలో కరోనా పాజిటివ్ ల సంఖ్య 365కు చేరింది. గడిచిన గడిచిన 24 గంటల్లో మొత్తం 892 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.