రాజకుటుంబంలో 150 మందికి కరోనా

By సుభాష్  Published on  10 April 2020 6:56 AM GMT
రాజకుటుంబంలో 150 మందికి కరోనా

కరోనా.. ఈ పేరు వింటేనే గజగజ వణికిపోవాల్సిందే. బయటకు వెళ్లాలంటేనే భయపడే రోజులొచ్చేశాయి. చైనాలో పుట్టిన ఈ మయదారి రోగం మృత్యువును వెంటాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు మరణాల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

ఇక సౌదీ ఆరేబియాలో రాజకుటుంబానికి చెందిన 150 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. రాజకుటుంబంలో 150 మంది పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కాగా, రియాద్ గవర్నర్ గా ఉన్న సౌదీ ప్రిన్స్ పైజల్ బిన్ బందర్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ కు ఈ వైరస్ సోకగా, ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

రాజకుటుంబంలో ఇంత మందికి కరోనా సోకడంతో కింగ్ పైజల్ ఆస్పత్రి వర్గాలు అప్రమత్తం అయ్యాయి. కాగా, వైరస్ సోకన వ్యక్తుల పేర్లు మాత్రం వెల్లడి కాలేదు. అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యగా రాజకుటుంబం, వారితో సన్నిహితంగా ఉండే వారి కోసం ఇప్పటికే ఓ ఆస్పత్రిలో 500 పడకలను సైతం ఏర్పాటు చేశారు అధికారులు.

Next Story