ఇవే గోల్డెన్ ట్వీట్ లు..!

By జ్యోత్స్న  Published on  11 Dec 2019 2:45 AM GMT
ఇవే గోల్డెన్ ట్వీట్ లు..!

ఇండియా ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. తన వాక్చాతుర్యంతో జనాన్ని ముగ్ధులను చేసే మోడీ సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉంటారు. అందుకే ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో మోడీకి 51.7మిలియన్ల ఫాలోవర్లున్నారు. ఇప్పుడు మోడీ మరోసారి రికార్డులకెక్కారు.

మోడీ చేసిన ఓ ట్వీట్‌‌‌‌‌‌‌‌ ఇండియాలో ఈ ఏడాది ‘గోల్డెన్‌‌‌‌‌‌‌‌ ట్వీట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది ఇయర్‌‌‌‌‌‌‌‌’గా నిలిచింది. 2019 ఎన్నికల్లో బీజేపీ రెండోసారి గెలిచిన తర్వాత ‘సబ్‌‌‌‌‌‌‌‌కా సాత్‌‌‌‌‌‌‌‌, సబ్‌‌‌‌‌‌‌‌కా వికాస్‌‌‌‌‌‌‌‌, సబ్‌‌‌‌‌‌‌‌కా విశ్వాస్‌‌‌‌‌‌‌‌.. విజయీ భారత్‌‌‌‌‌‌‌‌’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌‌‌‌‌‌‌‌ను గోల్డెన్‌‌‌‌‌‌‌‌ ట్వీట్‌‌‌‌‌‌‌‌గా ట్విట్టర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. ఈ ఒక్క ట్వీట్‌కు ఇప్పటిదాకా 4లక్షల 21వేల మంది లైక్‌లు కొట్టగా...దాదాపు 2లక్షల మంది రీట్విట్ చేశారు. మే 23న వెలుబడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే విజయం ఖరారైన తరువాత ఆ రోజు మధ్యాహ్నం 2.42 గంటలకు మోడీ ఈ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఎక్కువ మంది లైక్‌‌‌‌‌‌‌‌ చేసిన ట్వీట్‌‌‌‌‌‌‌‌ కూడా ఇదే.ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ పుట్టిన రోజున ఆయనని విష్ చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ క్రీడాప్రపంచంలో అత్యధిక రీట్వీట్లు పొందిన ట్వీట్ గా నిలిచింది. కోహ్లీ ట్వీట్ కు 4లక్షలకు పైగా లైక్ లు రాగా,47వేల రీట్వీట్లు వచ్చాయి.అటు ఎంటర్టెయిన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ విభాగంలో తమిళ స్టార్ హీరో విజయ్ తన బిగిల్ సినిమా పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా 1లక్షకు పైగా రీట్వీట్లు రాగా,2లక్షలకు పైగా లైక్ లను సంపాదించింది. లోక్ సభ ఎలక్షన్స్ 2019 హ్యాష్ ట్యాగ్ ఎక్కువమంది ట్వీట్ చేసిన హ్యాష్ ట్యాగ్ గా నిలవగా, భారత్ లో ఈ ఏడాది ఎక్కువమంది చాలా ఆశక్తిగా ఎదురుచూసిన ఈవెంట్ ఇస్రో నిర్వహించిన చంద్రయాన్-2.

Next Story