పాక్ విమాన ప్రమాదమప్పుడు పైలట్లు దేని గురించి మాట్లాడుతున్నారంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Jun 2020 2:02 PM GMT
పాక్ విమాన ప్రమాదమప్పుడు పైలట్లు దేని గురించి మాట్లాడుతున్నారంటే..?

ఇస్లామాబాద్: నెలరోజుల కిందట పాకిస్థాన్ లో ఘోర విమానప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 97 మంది మరణించారు. ఈ ప్రమాదానికి మానవతప్పిదమే కారణమని తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన నివేదికను తాజాగా అధికారులు బయటపెట్టారు. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(పిఐఏ) విమానం మే 22న రెండు ఇంజన్లు ఫెయిల్యూర్ కావడంతో కరాచీ లోని ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాలని భావించింది. కానీ జనావాసాల్లోకి దూసుకుని వెళ్ళిపోయింది. ఇద్దరు మినహా మిగతా అందరూ చనిపోయారు.

ఏవియేషన్ మినిస్టర్ గులామ్ సర్వార్ ఖాన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ పైలట్, ఏవియేషన్ కంట్రోలర్ స్టాండర్డ్ రూల్స్ ను పాటించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అన్నారు. ఎయిర్ బస్ ఏ320 ని ల్యాండ్ చేసే సమయంలో పైలట్లు కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ ఉన్నారని ఆయన అన్నారు.

పైలట్, కో పైలట్ ల్యాండింగ్ గురించి ఆలోచించకుండా.. కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ వచ్చారని ఖాన్ తెలిపారు. పాకిస్థాన్ కు చెందిన ఇన్వెస్టిగేషన్ టీమ్ వాయిస్ రికార్డుల ద్వారా జరిగిన విషయాలను అంచనా వేసింది. డేటా మొత్తాన్ని అనలైజ్ చేసి రిపోర్ట్ ను సబ్మిట్ చేశారు. ఆ విమానం 100 శాతం ఎగరడానికి అర్హత కలిగినదని.. ఎటువంటి టెక్నికల్ ఫాల్ట్ లేదని అన్నారు.

Next Story