విల్లాలోకి ప్రవేశించి భారతీయున్ని, అతని భార్యను చంపేసిన పాకిస్థానీ  

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Jun 2020 6:24 PM IST
విల్లాలోకి ప్రవేశించి భారతీయున్ని, అతని భార్యను చంపేసిన పాకిస్థానీ  

దుబాయ్: భారత్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను అతని భార్యను ఓ పాకిస్థానీయుడు చంపేశాడు. స్థానిక మీడియా రిపోర్ట్ ప్రకారం దొంగతనం కోసం ఓ విల్లాలోకి ప్రవేశించిన పాకిస్థానీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అరేబియన్ రాంచెస్ లోని తమ విల్లాలో ఉంటున్న హిరేన్ అధియా, విధి అధియా(వయసు 40ల్లో) లు విగతజీవుల్లా పడి వున్నారు. దుబాయ్ పోలీసులు 24 గంటల్లో సదరు పాకిస్థానీ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు గల్ఫ్ న్యూస్ మంగళవారం నాడు వెల్లడించింది.

బ్రిగేడియర్ జమాల్ అల్ జల్లాఫ్, డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీసు మీడియా తో మాట్లాడుతూ చనిపోయిన జంట కుమార్తె దుబాయ్ పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి జరిగిన ఘటనను వివరించింది. విల్లా లోని రెండు ఫ్లోర్ లను ఫోరెన్సిక్ నిపుణులు జల్లెడ పట్టారు.

చనిపోయిన వ్యక్తి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా పనిచేస్తున్నారని.. అతడి భార్య కూడా చనిపోయిందని, వారికి 18, 13 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఉన్నారంటూ మీడియాలో కథనాలు రావడంతో దుబాయ్ లోని ఇండియన్ కౌన్సిల్ జనరల్ ఆ చనిపోయిన జంటను గుర్తించారు. వారి బంధువులకు సమాచారం అందించారు.

జూన్ 18న ఆ కుటుంబం నిద్రపోతున్నప్పుడు నిందితుడు ఇంట్లోకి ప్రవేశించాడు. 2000 దిర్హమ్ లు ఉన్న పర్స్ ను దొంగిలించిన నిందితుడు ఇంకా విలువైనవి ఏమైనా ఉన్నాయా అని బెడ్ రూమ్ లోకి ప్రవేశించాడు. హిరేన్ కు మెలకువ రాగానే అతన్ని కత్తితో దాడి చేసి చంపేశాడు. హిరేన్ భార్యకు కూడా మెలకువ రాగా ఆమెను కూడా కత్తితో దాడి చేసి చంపేశాడు. 18 సంవత్సరాల కుమార్తె నిద్ర లేచి చూడగా అప్పటికే ఆమె తల్లిదండ్రులు రక్తపు మడుగులో ఉన్నారు. వెంటనే నిందితుడు తప్పించుకోడానికి ఆ అమ్మాయి మీద మీద కూడా కత్తితో దాడి చేసి పారిపోయాడు. మరీ తీవ్ర గాయాలు కాకపోవడంతో ఆమె దుబాయ్ పోలీసులకు ఫోన్ చేసింది.

ఘటన చోటుచేసుకున్న కిలోమీటర్ దూరంలో పోలీసులు కత్తిని గుర్తించారు. కొద్ది సేపటికే నిందితున్ని కూడా పోలీసులు పట్టుకోగలిగారు. తాను ఈ హత్యలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. సంవత్సరం కిందట ఆ విల్లాలో మైంటెనెన్స్ సిబ్బందిగా పని చేశానని.. ఆ సమయంలో టేబుల్ మీద పెద్ద ఎత్తున డబ్బు ఉండడాన్ని చూశానని అతడు చెప్పాడు. ఆ డబ్బు ఇంట్లో దాచి ఉంటారనే ఉద్దేశ్యంతో దొంగతనానికి వెళ్లాలని ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. అతడు కొన్ని ఆభరణాలను కూడా దొంగిలించగా వాటిని కూడా పోలీసులు రికవరీ చేశారు.

Next Story