పెద్దలను ఎదిరించి హిజ్రాతో సహజీవనం.. ఆ తరువాత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2020 6:19 AM GMT
పెద్దలను ఎదిరించి హిజ్రాతో సహజీవనం.. ఆ తరువాత

ఓ యువకుడు హిజ్రాను ప్రేమించాడు. ఇందుకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించి వారిద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే.. ఏమైందో తెలీదు కానీ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కారైక్కాల్ సమీపంలోని తిరునల్లారులో దిలీప్‌(26) అనే యువకుడు తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. అతడికి నిరావీకి చెందిన శివానితో (30) అనే హిజ్రాతో 6 నెలల క్రితం పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరిపెళ్లికి దిలీప్‌ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు సరికాదా.. అతడిని మందలించారు. శివానీని విడిచి తాను ఉండలేనని, ఆమెను మరిచిపోలేనని తెగేసి చెప్పాడు. ఇంట్లో నుంచి సైతం వెళ్లిపోయాడు. కార్తైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే.. ఏమైందో తెలీదు కానీ.. ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్నపోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story
Share it