భూమికి దగ్గరగా చంద్రుడు.. ఏం జరగనుందంటే.!

By అంజి  Published on  7 April 2020 11:27 AM GMT
భూమికి దగ్గరగా చంద్రుడు.. ఏం జరగనుందంటే.!

హైదరాబాద్‌: ఇవాళ రాత్రి చంద్రుడు.. మనకు సూపర్‌మూన్‌గా కనిపించనున్నాడు. తెల్లని వర్ణంలో ఉండే చంద్రుడు గులాబీ వర్ణంలోకి మారిపోనున్నాడు. వాస్తవానికి సూపర్‌ మూన్‌ అంటే చంద్రుడు తన కక్ష్యలో తిరిగే క్రమంలో భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు 15 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా, సాధారణం కంటే 7 శాతం పెద్దగా కనిపిస్తాడు. అందుకే ఈ రోజు కనిపించే చందమాను సూపర్‌ మూన్‌గా పిలుస్తారు. భూ క్షక్ష్యలో చంద్రుడు దగ్గరగా ఉండే స్థానాన్ని పెరోజి అంటారు. ఈ పెరోజి స్థానానికి చంద్రుడు వచ్చినప్పుడు మరింత ప్రకాశవంతంగా, పెద్దగా కనిపిస్తూ ఆలరిస్తాడు.

వసంతకాలం మొదటి పౌర్ణమి రోజున చంద్రుడు సూపర్‌ పింక్‌ మూన్‌ రూపంలో కనిపిస్తాడు. ఇవాళ రాత్రి చంద్రుడి అందాలు కనువిందు చేయనున్నాయి. రాత్రి సమయంలో ఆకాశంలో చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించనున్నాడు.

ఏప్రిల్‌ 7న ఉదయించి.. ఏప్రిల్‌ 8న ఉదయం చంద్రుడు అస్తమిస్తాడు. భూమికి, చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కి.మీ. ఉంటుంది. కానీ ఇవాళ ఆ దూరం 3,56,000 కి.మీ. తగ్గిపోతుందని ఖ‌గోళ‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 20 ఏళ్లలో ఇప్పటి వరకు 79 సూపర్‌ మూన్‌లు వచ్చాయి. సగటున మూడు నెలలకు ఒక సూపర్‌ కనిపించిందన్న మాట.

అయితే చంద్రుడు నిజంగా పింక్‌ రంగులోకి మారిపోతాడా అంటే.. మారిపోడు, అది కేవలం శాస్త్రీయ నామం మాత్రమేని శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చిన్పుడు సూపర్‌ మూన్‌ దృశ్యం కనబడుతుంది.

అయితే ఈ అందాలను భారతీయులు పూర్తిగా ఆస్వాదించే పరిస్థితి లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారత్‌లో సూపర్‌ మూన్‌ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ సారి చంద్రుడు భూమికి ద‌గ్గ‌ర‌గా వచ్చినప్పుడు భారత్‍లో సమయం 8వ తేదీ ఉదయం 8:05గా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Next Story