ఇందిరాపార్కు వద్ద వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ రెండు రోజుల పాటు వరి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ దీక్షకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
అయితే.. పీసీసీ అధ్యక్ష పదవికై చివరి వరకూ రేవంత్‌తో పోటీపడి, నిన్నమొన్నటి వరకూ అతనిని వ్యతిరేకించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఈ దీక్షకు హాజరయ్యారు.
దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం మొదలైంది. ఇద్దరు నేతలు వేదికపై పక్కపక్కన కూర్చుని నవ్వుతూ ముచ్చటించుకోవడం దీక్షకు హాజరైన కార్యకర్తల్లో కూడా జోష్ నింపింది.