Fact Check : ముస్లిం పెళ్ళికి వెళ్లిన ఆర్.ఎస్.ఎస్. నేతను ఇష్టమొచ్చినట్లు కొట్టారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Sep 2020 6:59 AM GMTముస్లిం పెళ్ళికి వెళ్లిన ఆర్.ఎస్.ఎస్. నేతను ఇష్టమొచ్చినట్లు కొట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి పేరు చంద్రబోస్ అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.
కేరళలో ఇంకా ఎన్ని రోజులు ఈ విధ్వంసకాండ కొనసాగుతుంది. కేరళలో ఎన్ని ఘోరాలు జరిగినా ఆ రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గానే ఉంటుందా..? ఇవి ప్రతి రోజూ జరుగుతున్న ఘటనలు అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. చంద్రబోస్ కు న్యాయం జరగాలి అంటూ ఫోటోను ట్వీట్ చేస్తున్నారు.
“How long Kerala can keep mum on these daily incidents on #RssKaryavahaks. Only until @BJP4Keralam takes over next year. This is so brutal. @RSSorg @BJP4India @amitmalviya @sambitswaraj #justiceforchandraboss” https://t.co/cit1DOT5Qj” అని ట్వీట్ లో చెప్పుకొచ్చారు.
ట్విట్టర్ లోనే కాదు ఫేస్ బుక్ లో కూడా ఈ ఫోటోలను అప్లోడ్ చేశారు.
అలాంటి ఫోటోలే మరిన్ని ఫోటోలు దొరికాయి. అందులో చంద్రబోస్ కుటుంబం మీద దాడి చేస్తూ ఉండడాన్ని గమనించవచ్చు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటోలు పచ్చి అబద్ధం.
వైరల్ అవుతున్న ఫోటోను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. యూట్యూబ్ లో ఓ వీడియో లభించింది. వైరల్ అవుతున్న ఫోటోలు ఈ వీడియో నుండే తీసుకున్నారు. చంద్రబోస్ తన కుటుంబంతో కలిసి 24:12 నిమిషాల సమయం వద్ద వీడియోలో కనిపించాడు.
చంద్రబోస్ అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఉన్న వ్యక్తి ఓ నటుడు. మలయాళం వెబ్ సిరీస్ లో నటించాడు. అతడి క్యారెక్టర్ పేరు చంద్రబోసు. ఆ వెబ్ సిరీస్ లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. ఎపిసోడ్ ఆఖరి ఫ్రేమ్ లో ఆ వ్యక్తిని గమనించవచ్చు. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న కాస్ట్యూమ్, వీడియోలో ఉన్న కాస్ట్యూమ్ అంతా ఒకటే..!
వీడియో డిస్క్రిప్షన్ ను చూస్తే ఆ వ్యక్తి పేరు అర్జున్ రతన్. ఆగష్టు 18న రతన్ ఇవే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వైరల్ ఇమేజ్ ఇంస్టాగ్రామ్ లో నుండే తీసుకున్నారు.
�
View this post on Instagram�
ഇത്രയും വൃത്തികെട്ട ഒരു മനുഷ്യനെ എന്റെ കെരിയറി ഞാൻ കണ്ടിട്ടില്ല !
A post shared by Arjun Ratan (@arjun_ratan) on
సామాజిక మాధ్యమాల్లో రతన్ పెట్టిన పోస్టుల్లో నుదుటి మీద నారింజ రంగు తిలకం లేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో ఆ వ్యక్తి నుదుటి మీద నారింజ రంగు బొట్టును ఎడిట్ చేశారు.
మలయాళం నటుడికి చెందిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కథనాలతో ప్రచారం చేస్తూ ఉన్నారు. వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.