హైదరాబాద్‌: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 18 రోజుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అస్సలు కదలడం లేదు. గతంలో రోజుకు కనీసం 10 పైసలు, 8 పైసలు అటు ఇటూగా పెరుగుతూ లేదా తగ్గుతూ ఉండేది. అయితే గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. దేశీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

ఫిబ్రవరి నెలలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గాయి. రోజుకు కనీసం 10 పైసల తగ్గుదలతో 3 రూపాయలు తగ్గింది. ఆ తర్వాత మహమ్మారి కరోనా వైరస్‌ ధాటికి స్టాక్ట్‌ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో మూడు రోజుల్లోనే 4 రుపాయలు తగ్గింది. అలా అప్పటి నుంచి ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Also Read: కరోనా వచ్చినా వదలని టిక్‌టాక్‌ పిచ్చి

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గుముఖం పట్టాయి. ముడిచమురు ధరల ప్రతిపాదికనే ఇంధన కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరిస్తుంటాయి. గురువారం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.73,97, డీజిల్‌ ధర రూ.67.82 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై, దేశ రాజధాని ముంబైలో కూడా ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

Also Read: ఏపీలో అమాంతం పెరిగిన కరోనా కేసులు

ఇదిలా ఉంటే.. 100 శాతం శుద్ధమైన పెట్రోలు, డీజిల్‌ విక్రయించే ప్రపంచ దేశాల జాబితాలో భారత్‌ చేరుకుంది. ఇంధనాలను శుద్ధి చేసేందుకు చమురు కంపెనీలు యూరో-6 ఇంధన ఉద్గారాల నియంత్రణ వల్ల ఇది సాధ్యమైంది. ఏప్రిల్‌ 1 నుంచి పెట్రోల్‌ బంక్‌ల్లో బీఎస్‌-6 గ్రేడ్‌ ఇంధనం అందుబాటులోకి వచ్చింది. ఈ మార్పు వల్ల ఇంధన ధరలు పెరగాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ ముడి చమురు ధరలు కనిష్టానికి తగ్గినందున పాత ధరలనే నిర్ణయించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.