రైతులను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలి
By తోట వంశీ కుమార్
అమరావతి : రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల ఫించన్లు వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ అధినేత పవర్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. కష్టాల్లో ఉన్న వారిపై కేసుల పేరిట వేధింపులు తగవన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారన్నారు. అయితే.. వారిని పాత కేసుల పేరుతో పోలీస్ స్టేషన్‌లకు తీసుకెళ్లడం తగదని అన్నారు. తమ రాష్ట్ర రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులు, రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలపై సానుభూతి చూపించాలని పవన్ కోరారు.
లాక్‌డౌన్ కాలంలో రైతన్నలకు కష్టాలు రాకుండా చూడాలని, వారిని ఇబ్బంది పెట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభణతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ఇలాంటి సమయంలో కౌలు చెల్లింపులో జాప్యం జరిపితే.. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. ప్రస్తుత సమయంలో సీఆర్డీయే మాస్టర్ ఫ్లాన్ లో ఆర్-5 జోన్ నిబంధనలు చేర్చి రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామనడం రైతులను మానసిక ఆందోళనకు గురిచేడమే అవుందని పవన్ అభిప్రాయపడ్డారు.