అదే జరిగితే.. బీజేపీతో కలిసి నడవను
By అంజి
అమరావతి: బీజేపీ, వైసీపీ పొత్తు రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారంపై పవన్ సంచలన కామెంట్లు చేశారు. బీజేపీ, వైసీపీ పొత్తు పెట్టుకుంటే తాను తప్పుకుంటానని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. అయితే వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని తానే అనుకోవడం లేదని, పొత్తు పెట్టుకున్న తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఒకవేళ అదే జరిగితే తాను బీజేపీతో కలిసిన నడవనని పవన్ పేర్కొన్నారు. కాగా ఏపీ రాజధానిగా మాత్రం అమరావతేనని ఆయన సృష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా రాజధానిని మార్చడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
రాజధానిని మార్చడం ఆషామాషీ వ్యవహారం కాదని పవన్ అన్నారు. ఒకవేళ మార్చినా అది తాత్కాలికమేనని, రాజధాని ఎక్కడ అనేది 2014లోనే నిర్ణయించారన్నారు. రైతలు మరణాలకు ముమ్మాటికీ ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. అహంకారం తలకెక్కి నిర్ణయాలు తీసుకుంటే కుప్పకులుతారని పవన్ అన్నారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి గ్రామంలో జనసేన అధ్యక్షుడు పవన్ పర్యటించారు. 60 రోజులుగా అమరావతి రాజధాని కోసం రీలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు భరోసా కల్పించారు. ఎన్నికల సమయంలో వచ్చినట్లు ఓట్ల కోసం రాలేదని, రాజధాని ఎక్కడిపోదని ఇక్కడే ఉంటుందని భరోసా కల్పించడానికి వచ్చానని పవన్ అన్నారు.