దిగ్గ‌జ క్రికెట‌ర్లు కూడా భ‌ళాదూర్‌.. ఈ అమ్మాయి పుట్‌వ‌ర్క్ ముందు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 April 2020 11:36 AM GMT
దిగ్గ‌జ క్రికెట‌ర్లు కూడా భ‌ళాదూర్‌.. ఈ అమ్మాయి పుట్‌వ‌ర్క్ ముందు

క్రికెట్‌.. ఈ క్రీడ‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే క్రికెట్‌కు సంబంధించి ఏ చిన్న వీడియో నెట్టింట్లో ద‌ర్శ‌న‌మిచ్చినా అది వెంట‌నే వైర‌ల్‌గా మారుతుంది. అయితే.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్‌ వాన్ తాజాగా త‌న ట్విట‌ర్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేసారు. అది ఓ ఏడేళ్ల పాప క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో. ఆ వీడియోను ఈఎస్‌పీఎన్ స్పోర్ట్స్ ఛాన‌ల్‌, ప్ర‌స్తుత క్రికెట‌ర్లు, మాజీలు కూడా రీట్వీట్ చేస్తున్నారంటే ఆ వీడియో ఎంత‌గా ఆక‌ట్టుకుందో అర్థ‌మ‌వుతుంది.

వివ‌రాళ్లోకెళితే.. భార‌త్‌కు ప‌రిశ‌ర్మ వ‌య‌స్సు ఏడేళ్లు. అయినా క్రికెట్ ఓన‌మాలు తెలిసిన ప్రొపేష‌న‌ల్ క్రికెట‌ర్‌లా ఉంద‌ని త‌న ప్రాక్టీస్ వీడియో చూసిన‌వారెవ‌రైనా అంటారు. అవును సాధ‌న‌లో భాగంగా క‌చ్చిత‌మైన టైమింగ్‌.. పుట్‌వ‌ర్క్‌తో షాట్లు ఆడుతూ అంద‌రిని అబ్బుర‌ప‌రుస్తుంది

ఇక ఈ వీడియో ట్వీట్ చేసిన మైకేల్ వాన్‌.. 'ఈ వీడియోను చూడండి. ప‌రిశ‌ర్మ పుట్‌వ‌ర్క్‌కు ఫిదా అవ్వాల్సిందే. మాంచి షాట్ల‌ను ఆడ‌టానికి పుట్‌వ‌ర్క్ ఎంతో అవ‌స‌రం. ఆ విష‌యంలో ప‌రిశ‌ర్మ‌ను అందుకోవ‌డం క‌ష్టం' అని అన్నారు. ఇక విండీస్ క్రికెట‌ర్ షాయ్ హోప్ కూడా ప‌రిశ‌ర్మ వీడియోను షేర్ చేస్తూ.. నీ ఫుట్‌వ‌ర్క్‌కు జోహార్లు.. నేను పెద్ద‌య్యాక ప‌రిశ‌ర్మ లాగే ఉండాల‌నుకున్నాన‌ని పేర్కొన్నారు. మ‌రి ఇంత‌లా ఆక‌ట్టుకుంటున్న ప‌రిశ‌ర్మ వీడియోపై సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురుస్తుంది. నీ పుట్‌వ‌ర్క్‌, టెక్నిక్ అద్భుతం.. భ‌విష్య‌త్ భార‌త క్రికెట్ జ‌ట్టుకు త‌ప్ప‌కుండా ప్రాతినిథ్యం ‌వ‌హిస్తుంద‌ని కామెంట్లు చేస్తున్నారు.Next Story
Share it