చెట్లు నరకవద్దంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. పచ్చదనం హరించుకుంటూ పోతే కొంత కాలానికి భూమి మీద ఆక్సిజన్ స్థాయి తగ్గి జీవరాశి మనుగడే కష్టం అయిపోతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఢిల్లీ లాంటి నగరాలలో చెట్లు లేకపోవడం వలన వాతావరణంలో కాలుష్యం ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటి పరిస్థితి తమ గ్రామంలో రాకూడదని ఉత్తరప్రదేశ్ లోని నగవా పంచాయితీలో ఓ గ్రామ పెద్ద భావించాడు. అయితే వాతావరణంలో కాలుష్యం గురించి ఎంత చెప్పినా.. నిరక్షరాస్యులైన ఆ గ్రామ ప్రజలలో మార్పు రాలేదు సరికదా, కావాలని తమని కలప కొట్టుకోకుండా అడ్డుకుంటున్నారని భావించటం మొదలుపెట్టారు. దీంతో పంచాయితీ పెద్ద పరాగ్ దత్ సరికొత్త ఆలోచన చేశాడు.

చెట్లు కొట్టకుండా ఉండేందుకు దేవుడు సాయం తీసుకున్నాడు. గ్రామంలో ఉన్న అన్ని చెట్ల మీద దేవుడు బొమ్మలను చిత్రించాడు.దీంతో గ్రామంలో ప్రజలు వంటిని దైవ స్వరూపాలుగా భావించి కొట్టడం మానేశారు.వాటికి ఇంకా పూజలు చేయడం కూడా మొదలెట్టారు.దీంతో తన ప్రయత్నం ఫలించిందని ఇప్పుడు పరాగ్‌దత్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఒక్కో చెట్టుపై రెండు గంటల శ్రమ, 2 వందల రూపాయలు వెచ్చిస్తే అవి దైవ స్వరూపాలుగా మారిపోతాయని, అవే తమను రక్షిస్తాయని చెబుతున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.