శమరిమల అయ్యప్ప స్వామి ఆదాయం రూ.100కోట్లు దాటేసింది. అయ్యప్పమలాధారణలు మొదలైన నాటి నుంచి ఒక రెండు నెలల్లోనే ఈ ఆలయానికి భారీ మొత్తంలో సమకూరుతుంది. ఆలయం తెరిచిన 28 రోజులకే ఈ ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పేర్కొంది.  గత ఏడాది ఈ సమయానికి రూ.64 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని తెలిపింది. కాగా, మండలం-మకర విలక్కు యాత్రకుగానూ నవంబర్‌ 17న అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఆదివారం నాటికి రూ.104.72 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ దేవస్థానం వివరించింది. అన్నదానం, ప్రసాదాల విక్రయం, హుండీల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు తెలిపింది. గత  ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆదాయం భారీగా పెరిగిందని, అన్ని వయసుల  మహిళలు ఆలయంలోకి ప్రవేశం చేయవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.