ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి తింటున్నారా..? అయితే జాగ్రత్త
By సుభాష్ Published on 14 Dec 2019 11:16 AM GMTబొప్పాయి… ఇది పల్లెటూళ్లలో తమ తమ పెరట్లోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది. ఇది చాలా లాభదాయకమైన ఫలం. ఇక సిటీ మార్కెట్లో దీని రేటు అధికంగానే ఉంటుంది. బొప్పాయిలో విటమిన్ సి గుణాలు అధికంగా ఉండి, మంచి మోతాదులో యాంటి ఆక్సిడెంట్స్, న్యూట్రింట్స్, విటమిన్స్ కలిగి ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని ఆకులు జ్వరాల్ని నయం చేయడానికి వాడతారు. డెంగ్యూతో బాధపడేవారికి ఈ ఫలంతో పాటు దీని ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈ ఫలాన్ని కొందరు తినకూడదని చెబుతున్నారు వైద్యులు. ఆ కొందరు ఎవరు ? ఎలాంటి కండీషన్స్ లో బొప్పాయి తినకూడదో చూడండి.
ఆస్తమ, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఫలానికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజీం ఉంటుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎలర్జీ లాంటిది. సమస్యలు ఇంకా పెంచుతుంది.
బొప్పాయి అధికంగా తింటే అది వీర్యకణాలపై చెడు ప్రభావం చూపవచ్చు అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే షుగర్ వ్యాధిని కంట్రోల్లో ఉంచడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కాని అతి ఎక్కువగా తింటే కూడా షుగర్ లెవల్స్ బాగా తగ్గిపోయే అవకాశలున్నాయి కూడా. కొందరు తక్కువ షుగర్ లెవల్స్ తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు బొప్పాయితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
చర్మ సంబంధిత సమస్యలకి బొప్పాయి మంచిదే. బీటా కెరోటిన్ ఉండటం వలన ఇది చర్మం రంగు తేలేలా చేస్తుంది. కాని అతిగా తింటేనే ప్రమాదం. ఇది తెల్ల, పసుపు మచ్చాలకి కారణం అవుతుంది. ఇప్పటికే ఈ సమస్య ఉంటే అస్సలు బొప్పాయిని ముట్టుకోవద్దని సూచిస్తున్నారు వైద్యులు.
బొప్పాయి లిమిట్ లో తీసుకుంటేనే మంచిది. గర్భిని స్త్రీలు బొప్పాయిని అతిగా ఇష్టపడకూడదు. ఎందుకంటే దీంట్లో లటేక్స్ ఉంటుంది. ఈ ఎలిమెంట్ యుతెరైన్ కాంట్రాక్షన్ కి కారణం అవుతుంది. దీని వలన కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ఒక్కోసారి అబార్షన్ కూడా అయ్యే అవకాశాలుంటాయి. ఇందులో అధిక మోతాదులో ‘విటమిన్- సి’ ఉండటం వలన బొప్పాయి మంచిదంటున్నారు. కాని ఎక్కువ విటమిన్ సి తీసుకుంటే రెనాల్ స్టోన్స్ సమస్య వస్తుంది. అలాగే బొప్పాయికి అతిగా అలవాటు పడితే గ్యాస్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. ఈ సమస్య ఉన్నవారు బొప్పాయిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.