చంద్రబాబువి కుట్ర రాజకీయాలు..

By అంజి  Published on  19 Jan 2020 12:35 PM GMT
చంద్రబాబువి కుట్ర రాజకీయాలు..

విశాఖ: తెలుగుదేశం పార్టీ అధినేత ఆర్థిక ఉగ్రవాదిలా మారిపోయారని వైసీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పల్రాజు అన్నారు. తన పాలనలో తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధిరాలేదన్నారు. చంద్రబాబు పదే పదే ప్రభుత్వానికి అడ్డు పడుతున్నారని పేర్కొన్నారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు రైతులను మోసం చేశాడన్నారు. విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఇంగ్లీష్‌ తప్పనిసరి అని ఇంగ్లీష్‌ మీడియంపై తెలుగుదేశం పార్టీ చేసిన హడావిడి అందరికీ తెలుసన్నారు.

ఇంగ్లీష్‌ మీడియంపై కోర్టులకు వెళ్లి కుట్రలు పన్నారని సీదిరి అప్పల్రాజు అన్నారు. ఈ అంశంపై టీడీపీ ఆతురత అందరి తెలుసన్నారు. ఈ సమస్యలన్నింటీని పరిశీలించిన తర్వాత చంద్రబాబు మానకస్థితిపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. హీరోగా కంటే విలన్‌గానే పవన్‌ కల్యాణ్‌ బాగా నటిస్తున్నారని, అయితే పవన్‌ ప్రజల అవసరాలను గుర్తించడంలేదన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం వైఎస్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రంలో ప్రజలను తప్పు దోవపట్టిస్తూ, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని అప్పల్రాజు వ్యాఖ్యనించారు.

Next Story