రేప‌టి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అసెంబ్లీలో టీడీపీ స‌భ్యులు అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై చ‌ర్చించేందుకు టీడీఎల్పీ స‌మావేశం జ‌రుగుతోంది. మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి ఐదుగురు ఎమ్మెల్యే లు గైర్హాజ‌ర‌య్యారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో స‌మావేశానికి హాజ‌రుకాలేక‌పోతున్నామ‌ని గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేశ్, అశోక్, అనగాని, భవాని పార్టీకి సందేశం పంపారు. పార్టీ ఆదేశానుసారం ఓటేయాలని విప్ జారీ చేశారు. ఈ ఐదుగురు రేపు అసెంబ్లీకి వ‌స్తార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండ‌గా ఈ అసెంబ్లీ స‌మావేశాల్లో వైసీపీ ప‌లు కీల‌క బిల్లులు ప్ర‌వేశ పెట్టే అవ‌కాశం ఉంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు అంతా పార్టీ ఆదేశానుసారం ఓటు వేయాల‌ని విప్ జారీ చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి లు కూడా విప్ ప‌రిధిలోకి వ‌స్తార‌ని, విప్ కు విరుద్దంగా వ్య‌వ‌హారిస్తే పార్టీ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తుంద‌ని పార్టీ హైక‌మాండ్ స్ప‌ష్టం చేసింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్