పాక్ డ్రోన్‌ను కూల్చివేసిన భద్రతా సిబ్బంది
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2020 6:51 AM GMTపాక్ వక్రబుద్ది మారలేదు. మరోసారి దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించింది. అయితే.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలోని దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ రహస్య డ్రోన్ తిరుగుతూ.. చిత్రాలు తీయడం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్‌ఎఫ్) సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కాల్పులు జరిపి దాన్ని కూల్చివేశారు.
కథువా జిల్లా హీరానగర్ సెక్టార్టులోని రథువా వద్ద ఉదయం 5.10నిమిషాలకు ఈ ఘటన జరిగింది. కాగా.. డ్రోన్‌ను కూల్చివేసే సమయానికి అది భారత భూభాగంలోకి 250 మీటర్ల దూరం చొచ్చుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో రహస్యంగా చిత్రాలు తీసేందుకే పాక్ డ్రోన్ ను పంపించిందని అనుమానిస్తున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈఘటనతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తం అయ్యాయి.
Next Story