భారత్‌లో 24 గంటల్లో 14,516 కేసులు.. 375 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2020 5:10 AM GMT
భారత్‌లో 24 గంటల్లో 14,516 కేసులు.. 375 మంది మృతి

భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినప్పటి నుంచి ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,516 కేసులు నమోదు కాగా.. 375 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,95,048కి చేరుకుంది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 2,13,831 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 1,68,269 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి 12,948 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 4వ స్థానంలో కొనసాగుతుండగా.. అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో ఎనిమిద స్థానంలో ఉంది.

ఇక రోజు రోజుకు అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్నా.. ప్రజల్లో కరోనా భయం కనిపించడం లేదు. బహిరంగ ప్రాంతాల్లో ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు సరికదా.. మాస్కులు కూడా ధరించడం లేదు. ఇక కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల అధికారులు మరో సారి లాక్‌డౌన్‌ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Next Story
Share it