భారత్‌ – పాకిస్తాన్ సరిహద్దులో మళ్లీ కాల్పుల మోత మోగింది. భారత్‌- పాకిస్తాన్‌ దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.  పాకిస్తాన్‌కు భారత బలగాలు ఎన్నిసార్లు బుద్దిచెప్పినా.. కుక్క తోక వంకరలా బుద్ధి ఏమాత్రం మారడం లేదు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో భారత దళాలే టార్గెట్‌గా దాడులకు తెగబడ్డారు.. పాక్ కాల్పులను భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇరువర్గాల కాల్పుల్లో ఒక భారత జవాన్ చనిపోగా.. ఇద్దరు పాకిస్తాన్ కమాండోలు హతమయ్యారు.

పాకిస్తాన్ ప్రత్యేక దళాలపై భారత్‌ బలగాలు ఎదురు దాడికి దిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన సైనికులు హతమయ్యారు. మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. పూంచ్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్‌ను పాక్ ప్రత్యేక దళాలు దాటే ప్రయత్నం చేశాయి. ఇరు వైపుల నుంచి రాకెట్ లాంచర్స్‌తో, ట్యాంక్ మిస్సైల్స్‌తో దాడులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ జరిపిన ఎదురుదాడులలో పాకిస్తాన్ సైన్యంలో ఇద్దరు చనిపోయినట్లుగా అక్కడి వర్గాలు వెల్లడించాయి. సుందర్‌బెనీ సెక్టార్‌లో పాకిస్తాన్ ఆర్మీ మూడు వైలపు నుంచి దాడి జరిపింది. పాకిస్తాన్ జరిపిన నియమాల ఉల్లంఘనలో ఇదొకటి. దాడి అనంతరం పూంచ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది భారత ఆర్మీ.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.