మోదీ చెప్పినట్లుగా అడుగులు.. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఫేస్ 3 ట్రయల్స్ మొదలు
By సుభాష్ Published on 19 Aug 2020 7:07 AM ISTరష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశంలో అప్పుడే వ్యాక్సిన్ వచ్చేసింది అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఫేస్-2 ట్రయల్స్ లో ఉన్నా కూడా ఆయనేమో అప్పుడే వ్యాక్సిన్ వచ్చేసిందంటూ చెప్పేశారు. ఆ విధంగా అయితే భారత్ లో మూడు వ్యాక్సిన్లు రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను దాటేశాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఆక్స్ ఫర్డ్ చెందిన 'కోవిద్ షీల్డ్' వ్యాక్సిన్ ఫేస్ 3 ట్రయల్స్ భారత్ లో అతి త్వరలోనే మొదలు కాబోతున్నాయి. ఈ విషయాన్ని మంగళవారం నాడు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఈ వారంలోనే ఫేస్ 3 ట్రయల్స్ మొదలయ్యే అవకాశం ఉందని చెబుతోందన్నారు.
ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఫేస్ 3 ట్రయల్స్ 20 సెంటర్లలో భారత్ లో మొదలుకానుంది. పూణే, ముంబై, అహ్మదాబాద్ లలో ఈ వ్యాక్సిన్ ను పరీక్షించనున్నారు. 1600 మందిపై ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
కరోనా వ్యాక్సిన్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రజలకు ఇచ్చిన భరోసాకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు.