సీఎం సెక్యూరిటీలో కరోనా కలకలం.. 13 మంది సిబ్బందికి కరోనా

By సుభాష్  Published on  18 Aug 2020 1:47 PM GMT
సీఎం సెక్యూరిటీలో కరోనా కలకలం.. 13 మంది సిబ్బందికి కరోనా

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ భద్రతా సిబ్బందిలో 13 మందికి కరోనా పాజిటివ్‌ రావడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల కొందరు సిబ్బంది కరోనా బారిన పడగా, తాజాగా మరి కొందరికి కరోనా సోకింది. దీంతో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సిబ్బందిలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 13కు చేరింది. వీరిలో 12 మంది భద్రతా సిబ్బంది కాగా, ఒకరు సీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు సిమ్లా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సురేఖ చోప్రా వెల్లడించారు.

కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 4208 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో 2835 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 17 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1300లకుపైగా యాక్టివ్‌ కేసులున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Next Story
Share it