ఆపరేషన్ తబ్లిగి జమాత్..రంగంలోకి అజిత్ ధోవల్
By రాణి Published on 1 April 2020 4:26 PM IST
తబ్లిగి జమాత్..ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రాంతంలో జరిగిన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో మత సభ్యులు హాజరయ్యారు. తెలంగాణలో 2200 మంది ఈ కార్యక్రమానికి హాజరైనట్లు గుర్తించారు. ఏపీలో కూడా సుమారు 1000 వరకూ హాజరైనట్లు తెలుస్తోంది. ఆంధ్రాలో ఇప్పటి వరకూ 373 మందికి కరోనా పరీక్షలు చేయగా..ఒక్కరోజులోనే 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఢిల్లీ నుంచి వచ్చినవారే.
Also Read : నిర్లక్ష్యానికి సూత్రధారులు ఎవరు.?
ఈ నేపథ్యంలో తబ్లిగి జమాత్ కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా సాద్ తో పాటు మరికొంతమందిపై ‘అంటువ్యాధుల చట్టం 1897’ ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు దిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవాత్సవ తెలిపారు. నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో ఉన్న వ్యక్తులను తరలించే కార్యక్రమం మంగళవారం అర్థరాత్రి వరకూ కొనసాగింది. అయితే మొదట అక్కడున్నవారిని తరలించేందుకు మౌలానా సాద్ సహకరించకపోవడంతో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. మార్చి 28వ తేదీ అర్ధరాత్రి రంగంలోకి దిగిన అజిత్ ధోవల్ అక్కడున్న మౌలానను ఒప్పించి అక్కడున్న వారందరినీ తరలించారు. ఇదంతా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాయడంతోనే జరిగింది.
Also Read : ఎస్సై కాళ్లకు మొక్కిన ఎమ్మెల్యే..వీడియో వైరల్