కరోనా వైరస్ సోకిన వారికి ఆస్పత్రిలో చికిత్సలందిస్తున్న దేవుళ్లు వైద్యులైతే..వ్యాధిని కట్టడి చేసేందుకు అలుపెరుగకుండా డ్యూటీ చేస్తున్నారు రక్షక భటులు. నిజం..రక్షక భటులు అన్న పేరు ఇప్పటికి సార్థకత సంపాదించుకుంది. కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి సోకే ప్రమాదకరమైన మహమ్మారి. దీనిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ ప్రకటించగా..లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయట తిరగకుండా కాపలా కాస్తున్నారు పోలీసులు. నిజానికి ప్రజలకు వైరస్ సోకకుండా రక్షణగా నిలుస్తున్నారు.

Also Read : ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి..

అలాంటి పోలీసులకు గౌరవమిస్తూ అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ నమస్కారం చేశారు. ఎస్సై కాళ్లకు మొక్కి..మీ లాగా ఎవరూ సేవలు చేయలేరని కొనియాడారు.. ఎమ్మెల్యే ఎస్సై కాళ్లకు మొక్కి దండం పెట్టగా..ఆ ఎస్సై కూడా ఎమ్మెల్యేకు సెల్యూట్ చేశారు. ఇలా ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తూ..తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, కుటుంబాల గురించి బెంగ ఉన్నా పక్కనపెట్టి..నిరంతరంగా చెక్ పోస్టుల్లో కాపలా కాస్తున్న రియల్ హీరోలు పోలీసులు. అలాంటి పోలీసులకు కాళ్లు మొక్కినా తప్పు లేదని భావించారు ఎమ్మెల్యే ఫాల్గుణ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read :నిద్రపోయాడు.. లేచి చూసేసరికి అద్భుతం.. అలాఎలా జరిగింది?

[video width="640" height="352" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/04/WhatsApp-Video-2020-04-01-at-2.16.46-PM.mp4"][/video]

రాణి యార్లగడ్డ

Next Story