ట్రేడ్ వార్‌కు తెరపడనట్లేనా..?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Nov 2019 6:13 AM GMT
ట్రేడ్ వార్‌కు తెరపడనట్లేనా..?!

ముఖ్యాంశాలు

  • చైనాతో ఎలాంటి చర్చలు జరగలేదు: ట్రంప్‌
  • వీలున్నప్పుడు భారత్‌లో పర్యటిస్తా: ట్రంప్‌

అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్‌వార్‌కు తెరపడే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ట్రేడ్‌వార్‌కు తెరపడిందన్న ఇరుదేశాల వ్యాపార వేత్తల ఆశలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్జీవం చేశారు. అమెరికాతో పలు కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకున్నామని చైనా వాణిజ్య శాఖ తెలిపింది. ఇరుదేశాల మధ్య విధించిన ట్యాక్స్‌లను ఎత్తివేసేందుకు అమెరికా అంగీకరించిందని చైనా అధికారి గావో ఫెంగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్‌ చైనా వస్తువులపై ట్యాక్స్‌లను ఎత్తివేసే దిశగా ఎలాంటి చర్చలు జరగలేదని పెద్ద బాంబ్‌ పేల్చారు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకులు ఎదుర్కొంటోందని.. అందుకే ఒప్పందానికి తొందరపడుతోందన్నారు. గతేడాది నుంచి ఇరుదేశాలు ట్రేడ్‌వార్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇరుదేశాల అధ్యక్షులు భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు భారత్‌తో మెరుగైన సంబంధాలు కొనసాగుతున్నాయని ట్రంప్‌ అన్నారు. భారత్‌తో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తనకు చిరకాల మిత్రుడు. వీలున్నప్పుడు భారత్‌లో పర్యటిస్తానని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. హ్యూస్టన్‌లో జరగిని 'హౌడీ-మోదీ' సభలో ట్రంప్‌ను ప్రధాని మోదీ భారత్‌కు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Next Story