ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్‌ చాందీ భేటీ అయ్యారు. ఏపీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సోనియా గాంధీతో ఉమెన్ చాందీ మంతనాలు జరిపారు. కాగా ఆశావాహుల జాబితాను ఉమెన్ చాందీ అందజేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడి కోసం ఐదుగురు అభ్యర్థులు రేసులో ఉన్నట్టు సమాచారం. ఏపీ పీసీసీ పీఠంపై మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు, చింతామోహన్‌, శైలజానాధ్, ఏపీ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, సీనియర్ కాంగ్రెస్‌ నేత గిడుగు రుద్రరాజు ఆశలు పెట్టుకున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story