మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన పోలీసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2020 1:44 PM GMT
మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం.. గుట్టురట్టు చేసిన పోలీసులు

జూబ్లీహిల్స్ కేంద్రంగా సాగుతోన్న ఆన్‌లైన్‌ వ్యభిచార రాకెట్‌ గుట్టును జూబ్లీహిల్స్‌ పోలీసులు రట్టు చేశారు. మసాజ్‌ సెంటర్‌ ముసుగులో ఓ అపార్టుమెంట్‌లో వేశ్య గృహాన్ని నడుపుతున్నట్లు గుర్తించారు. ఆ అపార్టుమెంట్‌పై దాడి చేసి నిర్వాహకురాలితో పాటు మరో ఇద్దరు విటులను అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌ పరిధిలోని రోడ్‌ నెంబర్‌ 25లో ఓ అపార్టుమెంట్‌లో శైలజ అనే మహిళ అవని వెల్నెస్‌ సెంటర్‌ను నిర్వహిస్తుంది. అక్కడికి వచ్చే మహిళలకు పురుషులను ఆమె సప్లై చేస్తోంది. అలాగే పురుషులను ఆకర్షించేందుకు ఓ వెబ్ సైట్ లో మహిళల ఫోటోలు ఫోస్టు చేసేది. త‌న‌ భర్త పరమేశ్వర్ తో కలిసి ఇలా ఆన్‌లైన్‌ బిజినెస్ చేస్తూ అక్ర‌మ సంపాద‌నకు అల‌వాటు ప‌డ్డారు. పొరుగు రాష్ట్రాల‌ నుండి కూడా అమ్మాయిల తీసుకువచ్చి.. వీరు ఈ వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అవని వెల్నెస్‌ సెంటర్‌ పై దాడి చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నిర్వాహకురాలు శైలజతో పాటు.. ఇద్దరు విటులను అరెస్టు చేశారు.

Next Story