100 మందికి జీతాలు చెల్లించిన క్యాషియర్‌కు కరోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2020 1:24 PM GMT
100 మందికి జీతాలు చెల్లించిన క్యాషియర్‌కు కరోనా

తెలంగాణలో కరోనా ఉదృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఎంత శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా.. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే కరోనా విజృంభిస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాదులోని జీహెచ్ఎంసీ కార్యాలయంలోని ఎస్ బీఐ బ్రాంచ్ క్యాషియర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందో టెన్షన్‌ నెలకొంది. కాగా.. ఆ క్యాషియర్‌ రోజు 100 మందికి జీతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో మొత్తం 332 మంది కరోనా బారీన పడ్డారు.

Next Story