క‌రోనా బారి నుండి ఆ హీరోయిన్ బ‌య‌ట‌ప‌డిందోచ్‌..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 March 2020 8:39 AM IST
క‌రోనా బారి నుండి ఆ హీరోయిన్ బ‌య‌ట‌ప‌డిందోచ్‌..

జేమ్స్ బాండ్ హీరోయిన్ ఓల్గా కురెలెంకో క‌రోనా బారి నుండి బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌స్తుతం తాను క్షేమంగా ఉన్న‌ట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించింది. అంతేకాదు త‌న‌ కుమారుడితో క‌లిసి విలువైన స‌మ‌యం గ‌డుపుతున్నాన‌ని పేర్కొంది. అలానే త‌న పోస్ట్‌లో క‌రోనాకి సంబంధించిన అనుభ‌వాలు వివ‌రించింది.

మొద‌టి వారం రోజులు చాలా క‌ష్టంగా గ‌డిచాయ‌ని. తీవ్ర‌మైన జ్వరం, త‌ల‌నొప్పితో చాలా బాధ‌ప‌డ్డానని పేర్కొంది. ఇక‌ రెండో వారంలో జ్వ‌రం క్ర‌మంగా త‌గ్గిందని.. ద‌గ్గు మాత్రం కొద్దిగా ఉండేదని తెలిపింది. అయితే ఆ స‌మ‌యంలొ మాత్రం పూర్తిగా అల‌సిపోయిన‌ట్టు మాత్రం అనిపించేదని.. రెండో వారం చివ‌ర‌లో మాత్రం ఆరోగ్యం కుదుట‌ప‌డ్డ‌ట్టు అయిందని ఓల్గా పేర్కొంది.

ఇదిలావుంటే.. ఉక్రెయిన్ దేశానికి చెందిన ఈ మోడ‌ల్, న‌టి.. 2008లో వ‌చ్చిన జేమ్స్ బాండ్ చిత్రం క్వాంట‌మ్ ఆఫ్ సోలేక్‌, 2013లో వ‌చ్చిన సైంటిఫిక్ చిత్రాల‌తో పాపుల‌ర్ అయ్యింది.

Next Story