భారత్‌కు తోడుంటాం: చైనా

By అంజి  Published on  24 March 2020 1:25 AM GMT
భారత్‌కు తోడుంటాం: చైనా

ఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణకు భారత్‌కు సహకారం అందిస్తామని చైనా వ్యాఖ్యనించింది. కష్ట సమయంలో భారత్‌ తమకు అండగా నిలిచిందని చైనా దేశ విదేశాంగ అధికార ప్రతినిధి జంగ్‌ షుయాంగ్‌ అన్నారు. సోమవారం నాడు విలేఖరులతో మాట్లాడిన ఆయన.. మహమ్మారి కరోనాను కట్టడి చేయడంలో తమ అనుభవాలను, చేపట్టిన చర్యలను భారత్‌తో పంచుకుంటామని అన్నారు. చైనాలో కరోనా వైరస్‌ నివారణకు భారత్‌ ఎంతో తోడ్పందని అన్నారు.

తమ దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నప్పుడు.. తమకు సహాయం అందించిన 19 దేశాలకు ప్రతి సాయం చేస్తామన్నారు. చైనాలో కరోనాతో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు లేఖలు, ఫోన్‌ల ద్వారా సంఘీభావం ప్రకటించారని జంగ్‌ షుయాంగ్‌ అన్నారు.

ఇక చైనాలో ఉన్న భారతీయుల విషయంలో ప్రత్యేక ఆరోగ్య పరిరక్షణ, భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రన విషయమై భారత్‌ సహా చాలా దేశాలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించామన్నారు.

Also Read: ఇటలీ అధ్యక్షుడు కన్నీరు పెట్టలేదు.. అది ఫేక్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. భారత్‌లో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగానే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. కాగా దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు మన దేశంలో 433 మందికి కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయిత కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది

Next Story