రూ.5 లక్షల ఒప్పందం.. కొడుకును కనాలని యువతిని వేధిస్తున్న వృద్ధుడు
By అంజి Published on 20 Feb 2020 3:15 PM IST
హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన వంశాన్ని నిలబెట్టే సంతానం కావాలనుకున్న ఓ వృద్ధుడు.. ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కొడుకు కోసం చివరకు వృద్ధుడు 22 ఏళ్ల అమ్మాయితో కృత్రిమ గర్భదారణకు ఒప్పందం చేసుకున్నాడు. రూ.5 లక్షలకు ఆ వృద్ధుడు అమ్మాయితో ఒప్పందం చేసుకున్న ఈ ఘటన పంజాగుట్టలో జరిగింది.
అయితే వృద్ధుడికి మధ్యలో దుర్భుద్ది పుట్టినట్టుంది. దీంతో ఒప్పందం ప్రకారం కృత్రిమ గర్భదారణ వద్దని ఆ అమ్మాయిని వృద్ధుడు వేధింపులకు గురిచేశాడు. సహజంగానే పిల్లలు కావాంటూ అమ్మాయిని బలవంతం చేశాడు. వృద్ధుడి టార్చర్ తట్టుకోలేకపోయిన ఆ యువతి.. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆనంద్‌నగర్‌లో నివాసం ఉంటున్న వృద్ధుడు స్వరూప రాజు(64)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్వరూప రాజుకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నూర్ అనే మధ్యవర్తి వ్యక్తితో 22 ఏళ్ల అమ్మాయితో స్వరూపరాజ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని తెలుస్తోంది. అమ్మాయి చూసిన తర్వాత తీరు మార్చుకున్న స్వరూప రాజ్‌కు.. ఇప్పుడు జైళ్లో ఊచలు లెక్కబెట్టే పరిస్థితి వచ్చింది.