వీడు మాములోడు కాదు.. లోన్‌ కోసం వచ్చిన మహిళలను..

అతనో బ్యాంక్‌ ఉద్యోగి.. బ్యాంక్‌కి లోన్‌ కోసం వచ్చే మహిళలను లోబరుకుని రాసలీలలు సాగిస్తుండేవాడు. అతడి సెల్‌ఫోన్‌లో దాదాపు 200పైగా అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించిన అతని భార్య.. పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో ఈ బ్యాంకు ఉద్యోగి రాసలీలలు బయటపడ్డాయి.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాకు చెందిన ఎడ్విన్‌ జయకుమార్‌ (36) పుదుకోట్టై జిల్లాలోని ఓ బ్యాంకులో క్యాషియర్‌‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం అతడికి తంజావూరుకు చెందిన మహిళ(32)తో వివాహమైంది. పెళ్లి సమయంలో భారీగా నగలు, నగదు తీసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి భర్త తనతో సన్నిహితంగా ఉండకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. రాత్రిళ్లు తనను పట్టించుకోకుండా సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేసేవాడు. దీనికి తోడు పుట్టింటి నుంచి 50 సవర్ల బంగారం తీసుకురావాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

భర్త ఇలా ప్రవర్తించడానిక గల కారణాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకొని.. భర్తకు తెలియకుండా అతడి రెండు సెల్‌ఫోన్లను చూసింది. అందులో కనిపించిన వీడియోలు చూసి షాక్ తగిలింది. అందులో.. 200 మందికి పైగా మహిళలతో తన భర్త సాగిస్తున్న రాసలీలలు, వారితో కలిసి తీసుకున్న న్యూడ్ ఫోటోలు కనిపించాయి. అనేక మంది మహిళల బ్యాంకు ఖాతాల వివరాలు ఉన్నాయి. బ్యాంకుకు వచ్చే మహిళా ఖాతాదారులు, ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండే మహిళలతో అతడు కామకలాపాలు సాగించినట్లు తెలుసుకుంది.

ఈ విషయంలో జయకుమార్‌కు బ్యాంకులో పనిచేస్తున్న ఓ మహిళ సహకరిస్తున్నట్లు తెలుసుకుని.. విషయాన్ని అత్తగారితో పాటు పుట్టింట్లో చెప్పింది. విషయం బయట పడడంతో.. భర్త జయకుమార్‌.. రెండు సార్లు ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఆమె చాకచక్యంగా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించి ఆ కీచక భర్త గురించి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అతను తన 13 సెల్‌ఫోన్లలోని డేటాను మొత్తం డిలీట్ చేసేశాడు. పోలీసులకు దొరికిపోతానన్న భయంతో ఎడ్విన్ జయకుమార్ తల్లి, సోదరి, బ్యాంకులో తనకు సహకరించిన మహిళతో కలిసి పరారయ్యాడు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్