లులు మాల్ అవుట్‌లెట్‌లలోకి భారీగా వచ్చే వ్యక్తుల సంఖ్యను అసలు ఊహించలేదు. ప్రత్యేక 50 శాతం డిస్కౌంట్ పొందేందుకు వేలాది మంది దుకాణదారులు మాల్‌లోకి ప్రవేశించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. జూలై 6 రాత్రి 11:59 నుండి జూలై 7 తెల్లవారుజాము వరకు మాల్ ప్రజల కోసం తెరిచి ఉంటుంది. కోచిలోని 'లులూ' షాపింగ్ మాల్ కు ప్రజలు భారీగా తరలివచ్చిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కేరళలోని తిరువనంతపురం, కోచి లో ఉన్న లులూ అవుట్ లెట్ల వద్దకు భారీగా ప్రజలు వచ్చేశారు.
లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ భారీ డిస్కౌంట్లు ప్రకటించడం వల్ల జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. మాల్స్ బయట, లోపల, ఎలివేటర్ ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. అన్ని ఉత్పత్తులపై 50 శాతం తగ్గింపును లులూ ఆఫర్ చేసింది. ఇంత భారీ రద్దీ ఉన్నా, తొక్కిసలాట చోటుచేసుకోకపోవడం అద్భుతమని చెప్పుకొచ్చారు. తిరువనంతపురం, కొచ్చి అవుట్‌లెట్‌ల నుండి అద్భుతమైన ఇలాంటి ఫోటోలు కనిపించాయి. వేలాది మంది ప్రజలు ఆఫర్స్ ను పొందడానికి క్యూలలో వేచి ఉన్నారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలలో మాల్ సిబ్బంది ఈ విపరీతమైన రద్దీని నియంత్రించలేకపోయిన దృశ్యాలు చూడవచ్చు.