మెట్రోలో అమ్మాయి డ్యాన్స్.. ప‌క్క‌న ఉన్న‌ అంకుల్ రియాక్ష‌న్ చూశారంటే..

Video Of Woman Dancing To Bollywood Song Inside Delhi Metro. ఢిల్లీ మెట్రోలో రీళ్లు, వీడియోలు చేయడం ఆపడం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వీడియోలు

By Medi Samrat
Published on : 11 Jun 2023 7:16 PM IST

మెట్రోలో అమ్మాయి డ్యాన్స్.. ప‌క్క‌న ఉన్న‌ అంకుల్ రియాక్ష‌న్ చూశారంటే..

ఢిల్లీ మెట్రోలో రీళ్లు, వీడియోలు చేయడం ఆపడం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ అమ్మాయి మెట్రో కోచ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్‌గా మారిన వెంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వీడియో చేయ‌డం తప్పని కొందరు.. సరైనదే అని కొందరు వాదిస్తున్నారు. దీనిపై డీఎంఆర్‌సీ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఫన్నీ క్యాప్షన్‌లతో, కామెంట్ల‌తో నెటిజ‌న్లు వీడియోను షేర్ చేస్తున్నారు. అమ్మాయి డ్యాన్స్ చేస్తుండ‌గా వెనుక ఉన్న ఓ ప్ర‌యాణికుడి రియాక్ష‌న్స్‌పై చాలా ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌. అంకుల్‌కు ఏసీలో కూడా చెమ‌ట‌లు ప‌డుతున్నాయి అని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.

గత కొన్ని రోజులుగా మెట్రోల‌లో అభ్యంతరకర రీళ్లు, అసభ్యకర వీడియోలు చేయ‌డం గమనార్హం. మొదటగా ఓ అమ్మాయి బికినీలో ఉన్న వీడియో బ‌య‌ట‌కు రాగా.. దీని తర్వాత.. ఇద్దరు అబ్బాయిలు స్కర్టులు ధరించిన వీడియో బయటకు వచ్చింది. ఆ త‌ర్వాత‌ ఈ ప్రక్రియ ఆగలేదు. అయితే.. ఎవరైనా ప్రయాణీకులు తప్పు చేసినట్లు అనిపిస్తే మెట్రో హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని డిఎంఆర్‌సి ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. మెట్రో ఉద్యోగులు మెట్రో గ‌మ్య‌స్థానానికి చేరుకున్న త‌ర్వాత‌ చర్యలు తీసుకుంటారని పేర్కొంది. అంతే కాకుండా మెట్రోలో ప్రయాణించేటప్పుడు మర్యాదగా ప్రవర్తించాలని డిఎంఆర్‌సి ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.


Next Story