ఆ మ‌హిళ జీవితంలో మ‌రిచిపోలేని సంఘ‌ట‌న‌లు రెండూ ఒకే రోజు జ‌రిగాయ్‌..!

US Woman Wins 81 Lakh Lottery Hours After Giving Birth. నార్త్ కరోలినా మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చిన కొన్ని గంటలకే

By Medi Samrat  Published on  4 Dec 2022 9:15 PM IST
ఆ మ‌హిళ జీవితంలో మ‌రిచిపోలేని సంఘ‌ట‌న‌లు రెండూ ఒకే రోజు జ‌రిగాయ్‌..!

నార్త్ కరోలినా మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చిన కొన్ని గంటలకే $100,000 (₹ 81,42,155) పవర్‌బాల్ లాటరీని గెలుచుకుంది. ఒకే రోజులో ఆమె జీవితంలో రెండు అపురూమపమైన ఘటనలు చోటు చేసుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాంకర్డ్‌కి చెందిన 28 ఏళ్ల హౌస్ కీపర్ బ్రెండా గోమెజ్ హెర్నాండెజ్ నవంబర్ 9న తన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె కాంకర్డ్‌లోని వారెన్ సి కోల్‌మన్ బౌలేవార్డ్‌లోని క్విక్‌ట్రిప్ స్టోర్ నుండి పవర్‌బాల్ టిక్కెట్‌ను కొనుగోలు చేసింది. నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ అధికారుల ప్రకారం, లాటరీ డ్రా రోజైన నవంబర్ 9న ఆమె ప్రసవ వేదనకు గురైంది.

తన కుమార్తెకు జన్మనిచ్చిన కొన్ని గంటల తర్వాత పవర్‌బాల్ డ్రాలో $100,000 గెలుచుకున్నట్లు తెలుసుకుంది. "నా కూతురు నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టినట్లు భావిస్తున్నాను. నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి." అని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె తన ఇద్దరు కుమారుల పుట్టినరోజు సంఖ్యలను ఎంచుకుంది.. అదృష్టవశాత్తూ, ఆ సంఖ్యలు డ్రాలో వచ్చాయి, దీంతో ఆమె $50,000 గెలుచుకుంది. 2X పవర్ ప్లే మల్టిప్లైయర్ హిట్ అవ్వడంతో ఆమె బహుమతి రెట్టింపు అయింది.


Next Story