డచ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న యూపీ వ్యక్తి

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన హార్దిక్ వర్మ (32) నెదర్లాండ్స్‌కు చెందిన అమ్మాయి గాబ్రియేలా దుడా (21)ని పెళ్లి చేసుకున్నాడు.

By Medi Samrat  Published on  1 Dec 2023 8:22 PM IST
డచ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న యూపీ వ్యక్తి

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన హార్దిక్ వర్మ (32) నెదర్లాండ్స్‌కు చెందిన అమ్మాయి గాబ్రియేలా దుడా (21)ని పెళ్లి చేసుకున్నాడు. నవంబర్ 29న హిందూ ఆచారాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. ఫతేపూర్‌లోని ఓ గ్రామంలో నివసించే హార్దిక్ ఉద్యోగం కోసం నెదర్లాండ్స్‌కు వెళ్లాడు. అతను ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా ఉద్యోగం సంపాదించాడు. అక్కడ తన సహోద్యోగి గాబ్రియేలాను కలుసుకున్నాడు. ఇద్దరూ దగ్గరయ్యారు. హార్దిక్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గాబ్రియేలాతో చెప్పడంతో అందుకు ఆమె కూడా ఒప్పుకుంది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

మూడు సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత, ఈ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. హార్దిక్ తల్లిదండ్రులతో ఫోన్‌లో ఈ విషయం గురించి చెప్పారు. గాబ్రియేలాతో కలిసి హార్దిక్ తన స్వస్థలానికి తిరిగి వచ్చాడు. అక్కడ వారిని అతని కుటుంబం ఘనంగా స్వాగతించింది. వివాహ వేడుకల్లో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డిసెంబరు 11న గాంధీనగర్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశామని, గాబ్రియేలా తండ్రి మార్సిన్ దుడా, ఆమె తల్లి బార్బరా దుడా, ఇతర కుటుంబ సభ్యులు హాజరవుతారని హార్దిక్ తెలిపాడు. డిసెంబర్ 25 న నెదర్లాండ్స్‌కు తిరిగి వెళ్లనున్నారు.

Next Story