ఆ అన్న‌ద‌మ్ములు హెలికాఫ్టర్‌ను తయారు చేశారు.. పోలీసులు సీజ్ చేశారు

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. పాత మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌ను హెలికాప్టర్‌గా మార్చారు.

By Medi Samrat  Published on  20 March 2024 1:37 PM GMT
ఆ అన్న‌ద‌మ్ములు హెలికాఫ్టర్‌ను తయారు చేశారు.. పోలీసులు సీజ్ చేశారు

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. పాత మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌ను హెలికాప్టర్‌గా మార్చారు. అక్బర్‌పూర్ బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు ఈ వాహనాన్ని గుర్తించి సీజ్ చేశారు. ఈశ్వర్దీన్, పరమేశ్వర్దీన్ అనే అన్నదమ్ములు.. వివాహాలకు ప్రత్యేకంగా కనిపించేలా కారును హెలీకాప్టర్ లా మార్చారు. వధూవరులను తీసుకుని వెళ్లాలనే ప్లాన్ చేసారు. అంతేకాకుండా వారి కుటుంబాలకు జీవనోపాధిగా ఈ హెలికాఫ్టర్ ఉంటుందని అనుకున్నారు.

మోడిఫై చేసిన వాహనానికి రంగులు వేయించేందుకు వెళుతుండగా, సాధారణ తనిఖీల్లో పోలీసులు వారిని పట్టుకున్నారు. వాహనం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హెలికాప్టర్ రోటర్ బ్లేడ్‌ను కారు పైకప్పుపై వెల్డింగ్ చేసి అతికించారు. కారు బూట్‌కు హెలీకాఫ్టర్ కు ఉండే తోకను జోడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవాణా నిబంధనలను పాటించనందుకు, సంబంధిత అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా మోడిఫై చేసినందుకు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే జరిమానా చెల్లించిన తర్వాత పోలీసులు వాహనాన్ని విడిచిపెట్టారు.

అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ పాండే మాట్లాడుతూ, "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కారణంగా, పోలీసులు నిరంతరం వాహన తనిఖీలు చేస్తున్నారు. అలాంటి ఒక తనిఖీ సమయంలో, ట్రాఫిక్ పోలీసులు ఈ కారును అడ్డుకున్నారు. మార్పులకు అనుమతి అవసరం కాబట్టి RTO విభాగం, వాహనాన్ని మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద సీజ్ చేశారు. ఇతర కోణాల్లో తదుపరి విచారణ కొనసాగుతోంది." అని తెలిపారు.

Next Story