బుడ్డోడు ప్రొఫెషనల్ చెఫ్‌లా ఎగ్‌ శాండ్‌విచ్ చేశాడు.. వీడియో చూస్తే నోరూర‌డం ప‌క్కా..!

Toddler makes egg sandwich like a pro chef. వంటగదిలో సాయం చేయడం లేదని తల్లులు తమ పిల్లలపై ఫిర్యాదు చేయ‌డం చూస్తూనే ఉంటాం

By Medi Samrat  Published on  24 Feb 2023 10:07 AM GMT
బుడ్డోడు ప్రొఫెషనల్ చెఫ్‌లా ఎగ్‌ శాండ్‌విచ్ చేశాడు.. వీడియో చూస్తే నోరూర‌డం ప‌క్కా..!

వంటగదిలో సాయం చేయడం లేదని తల్లులు తమ పిల్లలపై ఫిర్యాదు చేయ‌డం చూస్తూనే ఉంటాం. తల్లులను సంతోషపెట్టడం ఒకింత‌ కష్టమైన ప‌నే. ఆ త‌ల్లుల‌ను సైతం ఆక‌ట్టుకునేలా ఒక పసిపిల్లాడైన‌ చెఫ్.. ఎగ్‌ శాండ్‌విచ్‌ను తయారుచేసే వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. స్వీట్ బేబీ చెఫ్ అని రాసి ఈ క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది ఓ మ‌హిళ‌. పెంక ముందు పసిపిల్లవాడు కూర్చుని వంట చేయ‌డం వీడియోలో చూడ‌వ‌చ్చు. ప్రొఫెషనల్ చెఫ్‌లా బుడ్డోడు.. రొట్టె ముక్కను కాల్చడం.. గుడ్డును పగలగొట్టి పెంక‌పై వేయ‌డం.. రొట్టె లోపల పాలకూరను ఉంచి.. ఉడికిన ఎగ్‌ను రోటితో క‌లిపి తినేయ‌డం అంతా చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తుంది.

ఈ వీడియోను 9 ల‌క్ష‌ల మందికి పైగా చూశారు. 14 వేల‌కు పైగా లైక్‌లు.. అనేక కామెంట్స్‌ వచ్చాయి. బుడ్డోడి నైపుణ్యానికి నెటిజ‌న్లు ముగ్ధులయ్యారు. అయితే కొంద‌రు పిల్లాడి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి కార్యకలాపాలు చేస్తున్నప్పుడు పిల్లవాడిని పెద్దలు పర్యవేక్షించాలని కొందరు భావించారు. అందమైన బాబు.. అత‌నికి మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని ఒక నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా.. నేను ఈ చెఫ్‌కి 10/10 రేటింగ్‌ ఇస్తాను అని మరొక నెటిజ‌న్ స‌రాదాగా కామెంట్ చేశాడు.


Next Story