ఎగ్ పాప్ కార్న్.. ఇదెక్కడి టేస్ట్ అండీ బాబూ..!

This Bizarre Egg Popcorn Recipe Has The Internet Confused. సినిమాలకు వెళ్ళామంటే మొదట కొనుక్కునే తిండి పదార్ధం పాప్ కార్న్..!

By M.S.R  Published on  22 Oct 2021 3:12 PM IST
ఎగ్ పాప్ కార్న్.. ఇదెక్కడి టేస్ట్ అండీ బాబూ..!

సినిమాలకు వెళ్ళామంటే మొదట కొనుక్కునే తిండి పదార్ధం పాప్ కార్న్..! పాప్ కార్న్ లో కూడా మసాలా పాప్ కార్న్, ఛీజ్ పాప్ కార్న్.. ఇలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఎప్పుడైనా ఎగ్ పాప్ కార్న్ అనే పదం విన్నారా..? ఏంటీ ఎగ్ పాప్ కార్న్ ఉంటుందా అని మీకు డౌట్ వస్తోంది కదూ..! ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. అందులో ఎగ్ పాప్ కార్న్ చేస్తున్నట్లుగా ఉంది. వీడియోలో మొక్కజొన్న గింజలు గుడ్డుతో పాటూ వండినట్లు చూడొచ్చు. కొన్ని నిమిషాల తర్వాత పాప్‌కార్న్ సిద్ధంగా ఉంటుంది.

వీడియో @scottsreality_ ద్వారా అప్‌లోడ్ చేయబడింది. దీనికి 3.1 మిలియన్లకు పైగా వీక్షణలు మరియు 124k లైక్‌లు వచ్చాయి! గుడ్లు అల్పాహారం, భోజనం, విందు రూపంలో ఇష్టపడతారు మరియు కేకులు, సౌఫిల్స్ వంటి డెజర్ట్లలో కూడా ఉపయోగిస్తారు. కానీ చాలా అరుదుగా గుడ్డును ఫ్లేవర్‌గా.. అది కూడా పాప్‌కార్న్ కోసం ఉపయోగించుతారు. గుడ్డు రుచిగల పాప్‌కార్న్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇన్‌స్టాగ్రామ్ బ్లాగర్ @scottsreality వింతైన విషయాలను వంట చేయడానికి ప్రసిద్ధి చెందింది. కొన్ని వింతైన వంటకాలు కూడా చూడొచ్చు. ఏది ఏమైనా ఎగ్ పాప్ కార్న్ గురించి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ వస్తున్నారు.


Next Story