ఫోటో గ్రాఫర్ ఓవరాక్షన్.. పెళ్లికొడుకు యాక్షన్.. వధువు రియాక్షన్.. వీడియో వైరల్
The photographer was constantly taking pictures of the bride the groom slapped.శుభకార్యం ఏదైనా కానివ్వడండి..
By తోట వంశీ కుమార్ Published on 6 Feb 2021 3:52 PM IST
శుభకార్యం ఏదైనా కానివ్వడండి.. ఫోటోలు, వీడియోలు తీసి ఆ మధుర జ్ఞాపకాలను పదికాలాలపాటు పదిలంగా దాచుకుంటాం. ఈ మధ్యకాలంలో ఫ్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్టు వెడ్డింగ్స్ పేరుతో ఫోటోగ్రాఫర్లు అందమైన ఫోటోలు చిత్రీకరించేందుకు పలు టెక్నిక్‌లను వినియోగిస్తున్నారు. ఇక పెళ్లిలలో తీసే ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుకదండి. జీలకర్ర బెల్లం మొదలు తాళి కట్టే సమయంలోనూ ఫోటోలు తీసేవారి హడావుడి మామూలుగా ఉండదు. అయితే.. కొందరు అతిగా కూడా ప్రవర్తిస్తుంటారు. ఓ పెళ్లి వేడుకలో ఓ ఫోటో గ్రాఫర్ చేసిన పనితో అవాక్కైన పెళ్లికొడుకు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నింటికీ మించి వరుడి రియాక్షన్ తరువాత వధువు రియాక్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఆ వీడియోలో ఏముదంటే.. ఓ పెళ్లిలో వధువు, వరుడు స్టేజ్‌పైన నిలుచుని ఉన్నారు. ఫోటోగ్రాఫర్ వారిని ఫోటోలు తీస్తూ ఉన్నాడు. అయితే.. అతడు వధువుపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఒకటి రెండు ఫోటోలు అయితే ఫర్వాలేదు కానీ.. అదే పనిగా ఆమెనే ఆ ఫోటోగ్రాఫర్ పోటోలు తీయడం మొదలుపెట్టాడు. మరీ అతి చేస్తే పెళ్లి కొడుక్కి మండుతుంది కదా.. అందుకే చూసినంత సేపు చూసి.. ఆ ఫోటోగ్రాఫర్ పెళ్లి కూతురు ముఖాన్ని సరిచేస్తున్న సమయంలో మెడపై ఒక్కటి ఇచ్చాడు. అంతేకాదు ఇక్కడ నుంచి వెళ్లిపో అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. దీంతో ఆ ఫొటోగ్రాఫర్ ఒక్కసారిగా అదిరిపోయాడు. ఆ తర్వాత జరిగింది గ్రహించి సారీ చెప్పాడు.
I just love this Bride 👇😛😂😂😂😂 pic.twitter.com/UE1qRbx4tv
— Renuka Mohan (@Ease2Ease) February 5, 2021
ఇక వరుడు చేసిన పనికి వధువుకు నవ్వాగలేదు. కింద కూర్చుని మరీ, చేతులను స్టేజీపై కొడుతూ నవ్వింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి చూసి నవ్వేయండి