అంతులేని బాధ‌.. చెప్ప‌లేని ఆవేద‌న‌.. శ్రీకృష్ణుడితో కుమార్తెకు వివాహం జరిపించిన తండ్రి

Specially Abled girl marries lord krishna in Gwalior.కుమార్తెను పెళ్లి చేసుకునేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో తండ్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Nov 2022 9:44 AM IST
అంతులేని బాధ‌.. చెప్ప‌లేని ఆవేద‌న‌.. శ్రీకృష్ణుడితో కుమార్తెకు వివాహం జరిపించిన తండ్రి

త‌న కుమార్తెను పెళ్లి చేసుకునేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ఆ తండ్రి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. తన కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఈ పెళ్లి వీడియో వెనుక ఆ తండ్రి అంతులేని బాధ‌, చెప్ప‌లేని వేద‌న ఉంది.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్‌లో శివ‌పాల్ అనే వ్యాపార‌వేత్త త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఇత‌డికి దివ్యాంగురాలైన కుమారై ఉంది. ఆమెకు చెవులు విన‌ప‌డ‌వు, మాట్లాడ‌లేదు. 21 సంవ‌త్స‌రాలుగా చ‌క్రాల కుర్చీకే ప‌రిమితమైంది. త‌న కుమార్తెను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆమెకు పెళ్లి చేయాల‌ని బావించాడు. ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఆ యువ‌తిని పెళ్లి చేసుకునేందుకు ఏ ఒక్క‌రూ ముందుకు రాలేదు.

కూతురికి పెళ్లి జ‌ర‌గ‌డం ఇక కాని ప‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఆమెను శ్రీకృష్ణ భ‌గ‌వానుడికి ఇచ్చి పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఇక అనుకున్న‌దే ఆల‌స్యం త‌న కూతురికి పెళ్లి కుదిరింద‌ని, అంద‌రూ పెళ్లికి త‌ప్ప‌కుండా రావాల‌ని, బంధులు, మిత్రుల‌ను ఆహ్వానించాడు. భ‌గవాన్ శ్రీకృష్ణుడితో వివాహం అన‌గానే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

వివాహానికి ముందుగా మామూలుగానే మెహందీ వేడుక‌, విందు ఊరేగింపు నిర్వ‌హించారు. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న అమ్మాయి, వధువు పూలదండలు మార్చుకున్నారు. ఓ ఆల‌యంలో ఈ పెళ్లి తంతు జ‌రిగింది. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు వారిని ఆహ్వానించారు. ఆ తండ్రి సంబురంతో ఆనందభాష్పాలు రాల్చాడు. ప్ర‌స్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story