WPL టైటిల్ గెలిచాక.. స్మృతి మంథాన వెంట ఉన్న వ్యక్తి ఎవరు..?
భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి
By Medi Samrat Published on 19 March 2024 3:35 PM ISTభారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టైటిల్‌ను గెలుచుకుంది. ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత జట్టు సంబరాల్లో బిజీగా ఉన్నప్పుడు, మైదానంలో ఒక వ్యక్తి కనిపించాడు, అతను స్మృతి మంధానను కౌగిలించుకొని ఆమెను అభినందించాడు. ఇప్పుడు ఈ జంట ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రేమించిన వారితో మాత్రమే విజయాలను సెలబ్రేట్ చేసుకుంటారని అంటారు. జట్టు ఛాంపియన్ గా నిలవగా.. ఆమె ప్రియుడు పలాష్ ముచ్చల్ ఆ సమయంలో మైదానంలో ఉన్నాడు. దీంతో స్మృతిపై ప్రేమను కురిపించి.. ఆమెను కౌగిలించుకుని విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
పలాష్ తరచుగా స్మృతి మంధానతో ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటాడు. క్రికెట్ లో అత్యంత అందమైన మహిళా క్రికెటర్లలో స్మృతి కూడా ఒకరు. ఆమెకు అభిమానులు లక్షల్లో ఉన్నారు. పలాష్ గాయకుడు.. ఇండోర్ నివాసి పలాష్ పాడటమే కాకుండా డైరెక్షన్‌లో కూడా రాణిస్తున్నాడు. ఈ జంట మధ్య అద్భుతమైన బంధం ఉంది. తరచుగా స్మృతి పర్యటనలు ముగించుకుని స్వదేశానికి వస్తున్న క్రమంలో ఆమెను స్వాగతించడానికి ముచ్చల్ విమానాశ్రయానికి చేరుకుంటాడు.
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) మహిళా క్రీడాకారులు ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నారు. కోహ్లి RCB మహిళా కెప్టెన్ స్మృతి మంధానతో వీడియో కాల్‌లో సంభాషించాడు. కోహ్లీ RCB మహిళా ఆటగాళ్లను 'సూపర్ వుమెన్' అని పేర్కొన్నాడు. వేలాది మంది ఫ్రాంచైజీ అభిమానులు సోషల్ మీడియాలో ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసించారు.