అచ్చం షారుఖ్ ఖాన్ లాగే ఉంటాడు.. స్పెషల్ గెస్ట్ కూడా..!

Shahrukh's lookalike on social media. హీరోలను పోలిన వ్యక్తులు చాలానే మందే ఉంటారు. అలాంటి వ్యక్తులను సోషల్ మీడియాలో

By Medi Samrat  Published on  8 May 2022 3:00 PM GMT
అచ్చం షారుఖ్ ఖాన్ లాగే ఉంటాడు.. స్పెషల్ గెస్ట్ కూడా..!

హీరోలను పోలిన వ్యక్తులు చాలానే మందే ఉంటారు. అలాంటి వ్యక్తులను సోషల్ మీడియాలో మనం చాలా మందినే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను పోలిన వ్యక్తి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. అచ్చం కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ లాగే అభివాదం చేస్తూ.. ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతూ వస్తున్నాడు.

అతడు అచ్చం షారుఖ్ ఖాన్ లాగే ఉంటాడు. షారుఖ్ లుక్ లో ఉన్న వ్యక్తి పేరు ఇబ్రహీం ఖాద్రీ. ఇబ్రహీం ఖాద్రీ అత్యంత జనాదరణ పొందిన సోషల్ మీడియా స్టార్‌లలో ఒకడిగా ఎదుగుతూ ఉండడం విశేషం. ఇబ్రహీం ఖాన్ ఇన్‌స్టా పేజీలో అతని అనేక పోజ్ లను, ప్రొఫైల్‌ను చూస్తే, మీరు అసలు షారూఖ్‌ ఎవరా అని గందరగోళానికి గురవుతారు.

ఇబ్రహీం షారూఖ్‌లా కనిపించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ఓ మీడియా సంస్థకు చెప్పాడు. "నేను, నా స్నేహితులు షారుఖ్ ఖాన్ రయీస్‌ సినిమాని చూసినప్పుడు, అందరూ నన్ను సెల్ఫీల కోసం చుట్టుముట్టారు.'' అని చెప్పుకొచ్చాడు. తనను ఎంతో ప్రత్యేకంగా చూస్తారని కూడా తెలిపాడు. కింగ్ ఖాన్‌లా కనిపించడం వల్ల ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయని తెలిపాడు. ఒకసారి అభిమానులు తన షర్ట్ ను కూడా చించేశారని చెప్పుకొచ్చాడు ఇబ్రహీం.

షారుఖ్ లాగా కనిపించడం వల్ల నన్ను కూడా పెళ్లి కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. పెళ్లిళ్లకు ప్రత్యేక అతిథిగా చాలాసార్లు ఆహ్వానాలు వచ్చాయి. షారుఖ్ ఖాన్ సినిమా పాటలకు డ్యాన్స్ చేయడం కూడా చేస్తున్నాడట.. దీంతో మంచిగా రెమ్యునరేషన్ కూడా బాగానే వస్తోందని చెబుతున్నాడు. షారుఖ్ అంటే తనకు ఎంతో అభిమానమని.. ఆయన్ను కలవాలని కోరుకుంటూ ఉన్నానని తెలిపాడు ఇబ్రహీం.

Next Story