సెహ్వాగ్ వాడకం మామూలుగా ఉండదు.. ట్రెండ్ కు తగ్గట్టుగా..

Sehwag Recreates RRR Poster With Ganguly. వీరేందర్ సెహ్వాగ్.. ట్రెండ్ కు తగ్గట్టుగా ట్వీట్లు వేస్తూ దూసుకుపోతూ ఉంటాడు. మైదానంలో

By Medi Samrat  Published on  8 July 2021 9:53 AM GMT
సెహ్వాగ్ వాడకం మామూలుగా ఉండదు.. ట్రెండ్ కు తగ్గట్టుగా..

వీరేందర్ సెహ్వాగ్.. ట్రెండ్ కు తగ్గట్టుగా ట్వీట్లు వేస్తూ దూసుకుపోతూ ఉంటాడు. మైదానంలో అతడి బ్యాటింగ్ లో ఎంత విధ్వంసం ఉంటుందో.. ఆయన సోషల్ మీడియా పోస్టుల్లో అంతకంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కటీ ట్రెండింగ్ కు తగ్గట్టుగా ఉంటాయి. ఇటీవల రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. సినిమాకు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే..! బైక్ ను జూనియర్ ఎన్టీఆర్ డ్రైవ్ చేస్తూ ఉండగా.. వెనకాల రామ్ చరణ్ ఉన్నాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పలువురు ఎడిట్స్ చేసుకుని అప్లోడ్ చేసుకున్నారు.

ఇక ఈ రోజు భారత క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు. ఎంతో మంది సెలెబ్రిటీలు, క్రికెటర్లు గంగూలీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నారు. ఇక వీరేందర్ సెహ్వాగ్ కూడా దాదాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా.. అందుకు ఆర్.ఆర్.ఆర్. పోస్టర్ ను వాడడం విశేషం. భారత మాజీ కెప్టెన్, బిసిసిఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 49 వ పుట్టినరోజున సెహ్వాగ్ సోషల్ మీడియాలో ప్రత్యేక చిత్రాన్ని పంచుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తాజా పోస్టర్ నుండి రామ్ చరణ్ మరియు ఎన్‌టిఆర్ ముఖాలపై సెహ్వాగ్ మరియు గంగూలీ చిత్రాలను మార్ఫింగ్ చేయడాన్ని మనం చూడవచ్చు. తాజాగా ఆ పోస్టర్‌ని మార్ఫింగ్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. ఎన్టీఆర్ ప్లేస్‌లో తను, రామ చరణ్ ప్లేస్‌లో గంగూలీని ఉంచాడు. అలానే బైక్‌కి ముందు జాతీయ జెండాని అమర్చి.. నెంబర్ ప్లేట్‌‌కి దాదా అని రాశాడు. దాంతో.. సెహ్వాగ్ విషెస్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

ఈ ఫోటోషాప్ చిత్రాన్ని పంచుకుంటూ "Dada ki gaadi mein savaar hoke, dada ke saath hi ride par. That's what the ride was with @souravganguly for those 5 years. Wish you good health and happiness Dada in the coming year #happybirthdaydada." తన మనసులోని మాటను చెప్పాడు. గంగూలీతో తాను కలిసి చేసిన అయిదేళ్ల ప్రయాణాన్ని ఎప్పటికీ మరచిపోలేను అని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. దాదా నాయకత్వంలో ఎదిగిన దిగ్గజ క్రికెటర్లలో సెహ్వాగ్ ఒకరు. సెహ్వాగ్‌ను మిడిల్ ఆర్డర్ నుండి ఓపెనర్‌గా తీసుకుని వచ్చిందే గంగూలీ..! ఆ తర్వాత సెహ్వాగ్ ఓపెనింగ్ కు ఎంత మంది ఫ్యాన్స్ అయ్యారో లెక్కే లేదు.


Next Story