అందంగా ఉంది కదా అని వెళితే.. ప్రాణం పోయింది
Rat killed by Snake in Indonesia Bekasi Forest.అందంగా ఉంది కదా అది దేని దగ్గరికి పడితే దాని దగ్గరికి వెళ్లకూడదు.
By తోట వంశీ కుమార్ Published on 21 Feb 2021 3:48 PM IST
అందంగా ఉంది కదా అది దేని దగ్గరికి పడితే దాని దగ్గరికి వెళ్లకూడదు. ఆ అందం కోసం వెళితే.. చుట్టు పక్కలా ప్రమాదాలు పొంచిఉంటాయి. రోజా పువ్వు చాలా అందంగా ఉంటుంది అలా దాని గుబుక్కున ముట్టుకోలేం కదా.. దాని చుట్టు ముళ్లు ఉంటాయి. పాపం ఈ సంగతులను ఏమీ తెలియని చిట్టి ఎలుక.. అందంగా ఉంది కదా అని ఓ పాము దగ్గరికి వెళ్లింది. ఆ పాము బాగా ముద్దు వచ్చి ఉంటుంది పాపం వెంటనే వెళ్లి దానికి లిప్ టూ లిప్ కిస్ ఇచ్చింది. ఏంటీ నిజం కాదని అంటున్నారా..? నిజంగా నిజం అండి బాబు.
ఇండోనేసియాలోని బెకాసీ అడవుల్లో ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తన కెమెరాతో ఫోటోలు తీస్తున్నాడు. ఇంతలో అతడికి ఓ దృశ్యం కనపడింది. ఓ కొమ్మపై ఓ పాము ఉంది. అది నీలం రంగు కలర్‌లో ఉంది. అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ ఓ చిట్టి ఎలుక వచ్చింది. చూడడానికి భలే ముద్దుగా ఉంది ఆ ఎలుక. కొమ్మపై నీలం రంగులో ఉన్న పాము కనిపించింది. అయితే.. ఆ ఎలుకకు తెలీదు అనుకుంటా అది పాము అని. చూడడానికి బాగుంది కదా అని దాని దగ్గరికి వెళ్లింది.
మరీ బాగా ముద్దు వచ్చిందేమో వెంటనే దాని దగ్గరికి వెళ్లి.. లిప్ టూ లిప్ కిస్ ఇచ్చింది. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న ఆ ఫోటోగ్రాఫర్ వెంటనే తన కెమెరాలో బంధించాడు. పాము ఊరుకుంటుదా చెప్పండి.. దానికి కావాల్సిన ఆహారం దాని ముందుకే రావడంతో అమాంతం ఆ చిట్టి ఎలుకను మింగేసింది. పాపం ఆ చిట్టి ఎలుక దాని శత్రువు గుర్తించలేకపోయింది. సదరు ఫోటోగ్రాఫర్ ఆ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. అందంగా ఉంది కదా అని వెళితే.. కోరి ప్రమాదం తెచ్చుకోక తప్పదని అంటున్నారు ఈ చిత్రాన్ని చూసిన నెటీజన్లు.