ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో IPL మ్యాచ్‌కు సంబంధించింది. ఈ వీడియోను రాఘవ్ చద్దా భార్య పరిణీతి చోప్రా కూడా షేర్ చేశారు. రాఘవ్ చద్దా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఇంతలో వీరిని చూసిన అభిమానులు జిజు-జిజు అని గట్టిగా అనడం మొదలుపెట్టారు. అదే సమయంలో కొంతమంది రాఘవ్ చద్దాను తమ కెమెరాలలో బంధించారు. స్టేడియంలో అభిమానుల ప్రేమను చూసి రాఘవ్ చద్దా ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. దీని తర్వాత ఆయన నవ్వుతూ తన అభిమానులందరికీ హాయ్ చెప్పాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది ఈ వీడియోను తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో కూడా షేర్ చేశారు. వీరిది అద్భుతమైన జంట అని చాలా మంది అభిమానులు రాశారు. రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా 2023లో ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు. వారిద్దరి వివాహ వేడుకలు చాలా రోజుల పాటు జరిగాయి. వీరిద్దరి జీవితం ఆనందంగా సాగిపోతోంది, వీరిద్దరి జోడీని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు.