ముంబైలో మందేసిన అమ్మాయి.. బెంగళూరులో 2500 రూపాయల బిరియానీ ఆర్డర్ చేసింది

Mumbai girl 'drunk' orders biryani worth 2,500 from Bengaluru. భారతదేశంలో చాలా మంది మెచ్చే వంటకం ఏమిటంటే బిరియానీ అంటారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Jan 2023 10:53 AM GMT
ముంబైలో మందేసిన అమ్మాయి.. బెంగళూరులో 2500 రూపాయల బిరియానీ ఆర్డర్ చేసింది

భారతదేశంలో చాలా మంది మెచ్చే వంటకం ఏమిటంటే బిరియానీ అంటారు. ఇక ఫుడ్ డెలివరీ యాప్ లలో కూడా బిరియానీకి భారీగా ఆర్డర్లు ఉంటాయి. ఇక దేశవ్యాప్తంగా నిమిషానికి 186 బిరియానీ ఆర్డర్‌లు గత ఏడాది డెలివరీ చేశామని.. ఫుడ్ డెలివరీ సర్వీస్ Zomato తెలిపింది. ముంబైకి చెందిన ఒక మహిళ శుక్రవారం ₹2,500 విలువైన బిర్యానీని ఆర్డర్ చేసింది. అయితే ఆమె ఇచ్చిన ఆర్డర్ ఎంత సేపటికీ ఆమె దగ్గరకు చేరలేదు. ఎందుకంటే ఆమె చేసింది ముంబైలో కాదు. తాగిన మత్తులో ఆ మహిళ బెంగుళూరులోని ఒక రెస్టారెంట్ నుండి 2500 రూపాయల విలువైన బిర్యానీని ఆర్డర్ చేసింది.

బెంగళూరులోని ఫేమస్ రెస్టారెంట్స్ లో ఒకటైన మేఘనా రెస్టారెంట్ నుండి సదరు మహిళ తాగిన మత్తులో ఆర్డర్ ఇచ్చేసింది. కానీ ఆమె అనుకున్న సమయానికి బిరియానీ ఆమె దగ్గరకు చేరలేదు. తీరా హ్యాంగ్ ఓవర్ దిగిపోయాక ఆ మహిళ చూసుకుంది. తాను చాలా పెద్ద పొరపాటు చేశానని గుర్తించింది. @subiii అనే ప్రొఫైల్ నుండి తాను తాగిన మత్తులో శనివారం నాడు ముంబైలో ఉండి బెంగళూరులో ఉన్న రెస్టారెంట్ లో బిరియానీని ఆర్డర్ ఇచ్చానని.. డెలివరీ ఆదివారం వస్తుందని చెప్పిందని ట్వీట్ లో తెలిపింది. ఇక చూడండి నెటిజన్లు ఆమెతో మామూలుగా ఆడుకోలేదు.


Next Story
Share it