మెట్రోలో ప్రయాణించిన కోతి.. వీడియో వైరల్
Monkey Traveled in Delhi Metro.మెట్రోరైలులో వానరం ప్రయాణించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో
By తోట వంశీ కుమార్ Published on
20 Jun 2021 6:20 AM GMT

మెట్రోరైలులో వానరం ప్రయాణించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలోని యమునా బ్యాంక్ స్టేషన్ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోకి ఎలా ఎక్కిందో తెలీదు కానీ.. రైల్లో హుషారుగా అటు ఇటూ కలియ తిరిగింది. చాలా మంది ప్రయాణీకులు ఉండే సరికి భయం వేసిందో ఎమో తెలీదు గానీ తరువాత ఓ సీటుపై బుద్దిగా కూర్చొంది. తన పక్కన కూర్చున ప్రయాణీకుడిపై చేయి కూడా వేసింది. ట్రైన్ వెలుతుండగా పరిసరాలను అద్దాల్లోంచి చూస్తూ వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే.. దీనిని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) అధికారులు ధ్రువీకరించలేదు. ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోకు ప్రతిస్పందనగా.. కోచ్ వివరాలను అందించాలని ఢిల్లీ మెట్రో అధికారులు కోరారు. కాగా.. నెటీజన్లు దీనిపై తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. వాళ్ల ఫ్యామిలీ తన కోసం ఎదురు చూస్తుంటుంది. దయ చేసి తనను తన ఇంటికి చేర్చండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Next Story